Popular Posts

టీపీసీసీ సభ్యుడు దేప భాస్కర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన కాంగ్రెస్ అధ్యక్షులు

టీపీసీసీ సభ్యుడు దేప భాస్కర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన కాంగ్రెస్ అధ్యక్షులు

రజని వాయిస్ : రంగారెడ్డి బ్యూరో

మహేశ్వరం నియోజకవర్గంలోని రామకృష్ణాపురం డివిజన్ కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా పున్న గణేష్ నేత, ఎన్టీఆర్ నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా ముప్పిడి లింగస్వామి గౌడ్ నియమితులైన సందర్భంగా రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి చిలుక ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో టీపీసీసీ సభ్యుడు, మహేశ్వరం నియోజకవర్గ సీనియర్ నాయకుడు దేప భాస్కర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా దేప భాస్కర్ రెడ్డి నూతన అధ్యక్షులను శాలువాలతో సత్కరించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ బలోపేతం కోసం కృషి చేయడంతో పాటు ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉండాలని, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు.

తమకు శుభాకాంక్షలు తెలియజేసిన దేప భాస్కర్ రెడ్డికి నూతన అధ్యక్షులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, పార్టీ అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ బండి మధుసూదన్ రావు, ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం చైర్మన్ తలాటి రమేష్ నేత, జ్ఞానేశ్వర్ యాదవ్, అక్బర్, రామకృష్ణ గౌడ్, హమ్మద్, షఫీ, నబీ, నాగేష్ నేత, పటేల్, సుదర్శన్, రమేష్ గౌడ్, కృష్ణారావు, రేణుక, రమాదేవి, లావణ్య తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.