Popular Posts

కోకాపేటలో ఆకాశాన్ని తాకనున్న ట్రంప్ టవర్స్

కోకాపేటలో ఆకాశాన్ని తాకనున్న ట్రంప్ టవర్స్

దక్షిణ హైదరాబాద్‌లో తొలి ట్రంప్ టవర్స్ ప్రాజెక్టు

రజని వాయిస్: హైదరాబాద్

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిర్మాణ సంస్థకు చెందిన ప్రతిష్టాత్మక ‘ట్రంప్ టవర్స్ హైదరాబాద్’ ప్రాజెక్టుకు తెలంగాణ రేరా అనుమతి లభించింది. కోకాపేట్‌లో నిర్మించనున్న ఈ ప్రాజెక్టు దక్షిణ హైదరాబాద్‌లో తొలి ట్రంప్ టవర్స్ కావడం విశేషం.

ప్రాజెక్టు వివరాల ప్రకారం సుమారు 800 అడుగుల ఎత్తుతో రెండు 65 అంతస్తుల టవర్లను నిర్మించనున్నారు. ఈ రెండు టవర్లు 28వ అంతస్తు వద్ద ఏర్పాటు చేయనున్న ఆధునిక ‘సస్పెండెడ్ స్కై బ్రిడ్జ్’ ద్వారా అనుసంధానించబడతాయి. ఈ స్కై బ్రిడ్జ్‌పై ప్రత్యేకంగా ‘ట్రంప్ క్లబ్’ను ఏర్పాటు చేయనున్నారు. నగర అందాలను అన్ని వైపులా వీక్షించగలిగేలా క్లబ్ ఫ్లోర్‌ను అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.

ఈ ప్రాజెక్టును ట్రైబెకా డెవలపర్స్, ఐరా రియాలిటీ సహకారంతో అభివృద్ధి చేయనుంది. హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయి విలాసవంతమైన నివాస ప్రాజెక్టుల విస్తరణలో ఇది మరో కీలక మైలురాయిగా నిలుస్తుందని రియల్ ఎస్టేట్ వర్గాలు భావిస్తున్నాయి.