Popular Posts

అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలి: ఎమ్మెల్యే నవీన్ యాదవ్

(రజని వాయిస్ ) (ఆందోల్ ప్రతినిధి అశోక్)

బోనాల పండుగ సందర్భంగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆందోల్ నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోలీస్ కృష్ణ అలియాస్ బంకు కృష్ణ ఎమ్మెల్యేతో కలిసి రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు.

అనంతరం ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజలపై అమ్మవారి కటాక్షం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నారు. మైనార్టీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ చైర్మన్ పహీమ్ ఖురేషి కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా పోలీస్ కృష్ణ అలియాస్ బంకు కృష్ణ ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌కు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.