Popular Posts

కల్తీ పన్నీర్ రవాణాపై ఎస్‌వోటీ పోలీసులు దాడి

కల్తీ పన్నీర్ రవాణాపై ఎస్‌వోటీ పోలీసులు దాడి

504 కిలోల పనీర్ స్వాధీనం

మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా, రజని వాయిస్ ప్రతినిధి

వినియోగదారుల ఆరోగ్యానికి హానికరమైన పరిస్థితిలో తయారు చేసి రవాణా చేస్తున్నట్టుగా అనుమానించిన పనీర్‌పై ఎస్‌వోటీ-1 (మల్కాజిగిరి జోన్) పోలీసులు నాగారం ప్రధాన రహదారిలో తనిఖీలు నిర్వహించారు. సంఘటనలో ఓ వాహనాన్ని నిలిపి తనిఖీ చేసిన సంఘటనలో వాహనంలో సుమారు 504 కిలోల పనీర్ ఉండటాన్ని గుర్తించారు.పోలీసుల దర్యాప్తు ప్రకారం, దొడ్డి వెంకటాపురం గ్రామ ప్రాంతంలోని ఒక డెయిరీలో పనీర్‌ను అపరిశుభ్రమైన పరిస్తితుల్లో, నాణ్యత ప్రమాణాలను పాటించకుండా, సరైన ప్యాకింగ్, తయారీ తేదీ లేదా గడువు తేదీలుంటే లేకుండా తయారుచేసి విక్రయిస్తున్నట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఘటనలో డ్రైవర్ మంగా రంజీత్ (25) మరియు కార్మికుడు రాజేష్ (21)ని అదుపులోకి తీసుకుని, సంబంధిత వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. డెయిరీ యజమాని గున్నెల ఇలయ్య (50) అక్కడ లేరు అని పోలీసులు తెలిపారు.దాడిలో మహీంద్రా జీథో వాహనం, 504 కిలోల పనీర్, రెండు మొబైల్ ఫోన్లు, ఒక వెయింగ్ మెషిన్‌ను పోలీసులు స్వాధీనం చేశారు. అధికారులు అన్ని అంశాలను నమోదు చేసి నిందితులను తదుపరి చట్టపరమైన చర్యల కోసం కీసర పోలీస్ స్టేషన్‌కు అప్పగించినట్టు తెలిపారు.