1
1
ఎల్బీనగర్ రక్షణ సేన పగ్గాలు నరేష్ ప్రజాపతికి
నియామకాన్ని ప్రకటించిన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితమ్మ
పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్న నరేష్ ప్రజాపతి
రజని వాయిస్ : హైదరాబాద్ బ్యూరో
తెలంగాణ రక్షణ సేన ఎల్బీనగర్ నియోజకవర్గ ఇన్చార్జిగా దుగుంట్ల నరేష్ ప్రజాపతిని పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ నియమించారు. ఈ మేరకు పార్టీ అధికారికంగా ప్రకటించింది.ఈ సందర్భంగా దుగుంట్ల నరేష్ ప్రజాపతి మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి కీలక బాధ్యతలు అప్పగించిన కవితమ్మకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఎల్బీనగర్ నియోజకవర్గంలో బూత్ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేసి, పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా కార్యకర్తలందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతానని ఆయన పేర్కొన్నారు.