1
1
రజని వాయిస్ : హయత్ నగర్
రంగారెడ్డి జిల్లా హయత్నగర్‌లో బోనాల పండుగ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన బీసీ విద్యార్థి యువజన సంఘాల చైర్మన్ అనంతుల రామ్మూర్తి గౌడ్, ఎంబీసీ విద్యార్థి యువజన సంక్షేమ సంఘం చైర్మన్ మరియు రజనీ వాయిస్ దినపత్రిక ప్రధాన సంపాదకులు పి. బడే సాబ్ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక అర్చనలు నిర్వహించి, రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. బోనాల పండుగ తెలంగాణ సాంప్రదాయ వైభవానికి ప్రతీక అని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, స్థానిక యువజన సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.