1
1
నాగారం వద్ద అనుమానాస్పద పన్నీర్ తరలింపు అడ్డగింత
100 కిలోల లేబుల్ లేని పనీర్ స్వాధీనం చేసినట్లు అధికారుల వెల్లడి
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా, రజని వాయిస్ : ప్రతినిధి
మల్కాజిగిరి జోన్ ఎస్‌వోటీ–1 బృందం కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారం ప్రధాన రహదారిపై ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ సమీపంలో నిర్వహించిన తనిఖీల్లో లేబులింగ్ వివరాలు లేని పనీర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, మహీంద్రా స్కార్పియో వాహనం (TS 30 TA 5122)లో తరలిస్తున్న పనీర్‌ను పరిశీలించిన అనంతరం, యాదాద్రి భువనగిరి జిల్లా మల్లాపూర్‌లో ఉన్న ఒక పనీర్ తయారీ యూనిట్‌లో సోదాలు నిర్వహించారు. అక్కడ ఆహార భద్రతా ప్రమాణాలు, ప్యాకింగ్ మరియు లేబులింగ్ నిబంధనలకు సంబంధించిన పత్రాలను అధికారులు పరిశీలించినట్లు సమాచారం.తనిఖీల సందర్భంగా తయారీ తేదీ, గడువు తేదీ వివరాలు లేని పనీర్ ప్యాకెట్లు గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు. సంబంధిత నమూనాలను తదుపరి పరీక్షల కోసం పంపే ప్రక్రియ కొనసాగుతున్నట్లు తెలిపారు.
ఈ కేసులో వాహన డ్రైవర్లు కర్రె నితేష్ (21), గోపి నవీన్ (29)లను విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నట్లు, యూనిట్ నిర్వాహకుడు ఊగు సతీష్ అందుబాటులో లేడని అధికారులు వెల్లడించారు. కేసుకు సంబంధించిన విచారణ కొనసాగుతోందని చెప్పారు.స్వాధీనం చేసుకున్న వస్తువులు- మహీంద్రా స్కార్పియో వాహనం (TS 30 TA 5122)- లేబుల్ వివరాలు లేని సుమారు 100 కిలోల పనీర్- లేబులింగ్ నిబంధనలకు అనుగుణంగా లేని సుమారు 150 కిలోల పనీర్ ప్యాకెట్లు- 50 కిలోల సామర్థ్యం గల డిజిటల్ తూకం యంత్రం- రెండు మొబైల్ ఫోన్లుస్వాధీనం చేసుకున్న వస్తువులు మరియు అదుపులోకి తీసుకున్న వ్యక్తులను తదుపరి చట్టపరమైన చర్యల కోసం కీసర పోలీస్ స్టేషన్‌కు అప్పగించినట్లు అధికారులు తెలిపారు.