Popular Posts

సాహితీ సప్తతి సంబరం.. రామకృష్ణ చంద్రమౌళికి ఘన సన్మానం

సాహితీ సప్తతి సంబరం.. రామకృష్ణ చంద్రమౌళికి ఘన సన్మానం

జులై 26 న హైదరాబాద్‌లో సాహితీ, సాంస్కృతిక వేడుక

తెలుగు భాషా చైతన్య సమితి ఆధ్వర్యంలో ప్రముఖుల సమక్షంలో కార్యక్రమం

రజని వాయిస్ :హైదరాబాద్ బ్యూరో

ప్రముఖ కవి, విమర్శకుడు శ్రీ రామకృష్ణ చంద్రమౌళి 70వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగు భాషా చైతన్య సమితి ఆధ్వర్యంలో జూలై 26న హైదరాబాద్‌లోని తాజ్ మహల్ హోటల్, నారాయణగూడలో సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక సాహితీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ సందర్భంగా “భీమరథి శాంతి మరియు చంద్రమౌళి చంద్రికలు” (కవితలు, కథల సమాహారం – సంపుటి-3) గ్రంథాన్ని ప్రముఖుల చేతుల మీదుగా ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమం రామకృష్ణ చంద్రమౌళి గారి సాహిత్య ప్రస్థానానికి అంకితంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.

సాహిత్యాభిమానులు, కవులు, రచయితలు, మేధావులు పాల్గొనే ఈ వేడుకలో రామకృష్ణ చంద్రమౌళి గారి సాహిత్య సేవలను స్మరించుకుంటూ పలువురు ప్రముఖులు ప్రసంగించనున్నారు. తెలుగు సాహిత్యాభివృద్ధికి ఆయన అందించిన విశేష కృషిని కొనియాడుతూ ప్రత్యేక అభినందనలు తెలియజేయనున్నారు.

తెలుగు భాషా చైతన్య సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి సాహిత్యాభిమానులు, రచయితలు, కవులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.