1
1
తెలుగు భాషా వైభవానికి ఢిల్లీ వేదిక.. జాతీయ వాగ్దేవి పురస్కారాల ప్రదానం
జాతీయ తెలుగు సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో వైభవంగా వేడుకలువివిధ రంగాల ప్రముఖులకు జాతీయ వాగ్దేవి పురస్కారాల ప్రదానం
రజని వాయిస్ : న్యూడిల్లీ బ్యూరో
జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డా. సి. నారాయణరెడ్డి జయంతిని పురస్కరించుకుని జాతీయ తెలుగు సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో ఈ నెల 28న న్యూఢిల్లీలోని ఆంధ్ర అసోసియేషన్ హాల్లో సాయంత్రం 4 గంటలకు “తెలుగు వెలుగు సంబరాలు” అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు పరిషత్ కార్యనిర్వాహక అధ్యక్షులు కేశిరాజు రాంప్రసాద్ పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు.
ఈ వేడుకలకు కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అధ్యక్షత వహించనుండగా, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నట్లు తెలిపారు.
అలాగే రాజ్యసభ సభ్యులు కె. లక్ష్మణ్, బి. మస్తాన్ రావు, ఆర్. కృష్ణయ్యతో పాటు సానా సతీష్ బాబు, పాకా వెంకట సత్యనారాయణ, విజయ్ చింతకాయల, భాష్యం రామకృష్ణ, లింగంనేని రమేష్ తదితర ప్రముఖులు విశిష్ట అతిథులుగా పాల్గొననున్నారని, రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు పార్లమెంట్ సభ్యులు కూడా వేడుకలకు హాజరవుతారని పేర్కొన్నారు.కార్యక్రమంలో భాగంగా సుమారు 70 మంది కళాకారులతో ప్రత్యేక సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం డా. సినారె స్మారకార్థం నిర్వహించే కవి సమ్మేళనంలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ కవులు తమ కవిత్వాన్ని వినిపించనున్నట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులకు “జాతీయ వాగ్దేవి జీవిత సాఫల్య పురస్కారాలు” ప్రదానం చేయనున్నారు. ఈ పురస్కార గ్రహీతల్లో మాజీ మంత్రి, ఆచంట ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ, ఉద్దరాజు కాశీ విశ్వనాథ రాజు, చైతన్య రాజు (చాన్సలర్, గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ), రిటైర్డ్ అదనపు ప్రధాన కార్యదర్శి సీజే వేణుగోపాల్, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవచనకారులు ఆకెళ్ల విభీషణ శర్మ, తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి ఎన్. బాలాచారి, ప్రముఖ సినీ నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, ఉస్మానియా విశ్వవిద్యాలయం మాజీ తెలుగు శాఖాధ్యక్షులు ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు ఉన్నారు.

అదేవిధంగా జాతీయ వాగ్దేవి విశేష ప్రతిభ పురస్కారాలు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు, కంతేటి వెంకట్ రాజు, ముత్యాల శ్రీనివాస్, ఈతకోట భీమశంకర్ రావు, జక్కంపూడి లక్ష్మీనరసింహ నాగేంద్ర కుమార్, సుమన్ మచ్చ, పద్మా వర్మ అల్లూరి, కొట్టే సాయి ప్రసాద్, పి. బడే సాబ్, ఢిల్లీ వసంత్, కాగిత వెంకటరమణారావు, పెనుమత్స అర్జున్ రాజు, అల్లూరి రవివర్మ, కే. సుధీరమణ, ఎస్. రాజశేఖర్ రెడ్డి, చంద్రాబట్ల శ్రీనివాస్, బొల్లు రామ్మోహన్ నాయుడు తదితరులతో పాటు ఢిల్లీకి చెందిన మరో 30 మంది ప్రముఖులకు అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ మహోత్సవాన్ని కేశిరాజు రాంప్రసాద్, ముత్యాల శ్రీనివాస్, డా. కే. వర్మ, సుధీర్ ఆధ్వర్యంలో, కార్యక్రమ చైర్మన్ కంతేటి వెంకటరాజు నేతృత్వంలో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి తెలుగు భాషాభిమానులు, సాహిత్యవేత్తలు, కళాకారులు, ఢిల్లీలోని తెలుగు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు.