1
1
రాజలక్ష్మి కాలనీలో ఘనంగా కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవం
ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం
శ్రీమతి కొలన్ రాజ్యలక్ష్మమ్మ జ్ఞాపకార్థం నిర్మాణం – కాలనీవాసులకు అంకితం
రజని వాయిస్ : రంగారెడ్డి బ్యూరో
నాగోల్ పరిధిలోని రాజలక్ష్మి కాలనీలో నూతనంగా నిర్మించిన “రాజలక్ష్మి కాలనీ కమ్యూనిటీ హాల్” ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది. శ్రీమతి కొలన్ రాజ్యలక్ష్మమ్మ జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు కొలన్ నర్సింహా గౌడ్, కొలన్ ప్రభాకర్ గౌడ్, కొలన్ చంద్రశేఖర్ ఆజాద్, కొలన్ భరత్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ హాల్‌ను నిర్మించి కాలనీవాసులకు అంకితం చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎల్‌బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీ ప్రజలకు సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలు, శుభకార్యాల నిర్వహణకు ఈ కమ్యూనిటీ హాల్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. సమాజానికి శాశ్వత ప్రయోజనం చేకూరే విధంగా కమ్యూనిటీ హాల్ నిర్మించి ప్రజలకు అందించిన దాతలను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు.
అనంతరం యువ నాయకుడు కొలన్ చంద్రశేఖర్ ఆజాద్ జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ గౌడ సంఘం ఉపాధ్యక్షులు బద్దం ధనుంజయ్ గౌడ్, మాజీ నాగోల్ స్కూల్ కమిటీ అధ్యక్షులు బద్దం వెంకటేష్ గౌడ్, సీనియర్ బీఆర్ఎస్ నాయకులు అనంతుల రాజరెడ్డి, తూర్పటి చిరంజీవి, రంగేశ్వరి నాయుడు, సతీష్ యాదవ్, శిల్పా రెడ్డి, కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు, స్థానిక ప్రముఖులు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.