Popular Posts

యంగలి గోపికి మంత్రి వివేక్ ఆశీర్వాదం

యంగలి గోపికి మంత్రి వివేక్ ఆశీర్వాదం

రజని వాయిస్ : హైదరాబాద్

విద్యార్థి నేత యంగలి గోపి గౌడ్ తన జన్మదినం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం పొందారు.ఈ సందర్భంగా మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి యంగలి గోపి గౌడ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజా సేవలో మరింత చురుకుగా పనిచేసి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. సమాజ సేవా కార్యక్రమాల్లోనూ, విద్యార్థుల సమస్యల పరిష్కారంలోనూ నిబద్ధతతో ముందుకు సాగాలని సూచించారు.మంత్రి ఆశీర్వాదం పొందిన యంగలి గోపి గౌడ్ ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూ, విద్యార్థుల సంక్షేమం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం మరింత అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు.