మోత్కూరులో ఘనంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు
రజని వాయిస్ : మోత్కూరు
భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని గురువారం మోత్కూరు కొత్త బస్టాండ్ ఆవరణలో కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర నాయకుడు కందుల విక్రాంత్ ఆ ధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. చామల కిరణ్ కుమార్ రెడ్డి చిత్రపటంతో అలంకరించిన ప్రత్యేక కేక్‌ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో చామల కిరణ్ కుమార్ రెడ్డి చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సన్నిహిత సహచరుడిగా, భువనగిరి ఎంపీగా ఆయన పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్న నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఎం.డి. అయాజ్, యువ నాయకులు ఎస్కే బాబర్, స్వామి, రవి వెంకన్నతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.